పేదలకు కేంద్రం భారీ ప్యాకేజీ..

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందడగు వేసింది. పేదల ప్రజల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక చర్యలను ప్రకటించారు. 

ఉపశమన చర్యలు..

  • కరోనా ప్యాకేజీ కింద పేదలకు రూ.1.70 లక్షల కోట్ల సహాయం.
  • ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం.
  • కరోనా కేసుల్లో పని చేస్తున్న శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్ వైద్యలు, నర్సులకుు రూ.50 లక్షల ఆరోగ్య బీమా..
  • 3 నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన పథకం ద్వారా 80 కోట్ల మందికి రేషన్ 
  • రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు కూ.5 కేజీల బియ్యం లేదా గోధుమలు వీటితో పాటు కేజీ పప్పు సరఫరా.
  • పేదల ఖాతాలో నేరుగా నగదు బదిలీ
  • స్వయం సహాయక గ్రూపులకు రుణ పరిమితి రూ.10లక్షలకు పెంపు. ఎలాంటి పూచికత్తు లేని రుణాలు అందజేస్తాం.
  • ఉపాధి వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు.
  • ఉజ్వల్ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
  • రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా కేంద్రమే భరిస్తుంది. వంద మందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తింపు.
  • ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 75 శాతం వరకు పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. 
  • దేశ వ్యాప్తంగా 3.5 కోట్ల మంది నమోదిత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.31వేల కోట్ల నిధిని వారి అవసరాల కోసం ఉపయోగిస్తారు. 
  • వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.1000
  • జన్ ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు జమ.
  • రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్ ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు. 

Leave a Comment