ఓటింగ్ విధానంలో పెద్ద మార్పు..

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 1961 ఎన్నికల నియమావళిని సవరించింది.  కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. కరోనా వైరస్ సోకి నిర్భందంలో ఉన్న వారు మరియు లక్షణాలు ఉన్న వారికి కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

65 ఏళ్లు పై బడిన వారికి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు వైరస్ బారిన పడకుండా ఈ చర్యలు చేపట్టింది. అంతకుముందు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు మరియు సాయుధ దళాలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉండేది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించింది.  

Leave a Comment