కేంద్రం ప్రభుత్వం నుంచి భారీ ఆఫర్..

జూమ్ కు ప్రత్యామ్నాయ యాప్ ను రూపొందిస్తే రూ.కోటి నజరానా

కేంద్ర ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. జూమ్ యాప్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ రూపొందిస్తే రూ.కోటి నజరానా ఉంటుందని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకోవాలని కోరింది. ఏప్రిల్ 30 లోపు మరో యాప్ రూపొందించాలని పేర్కొంది. 

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ వాడకం ఎక్కువైంది. ఒకేసారి ఎక్కువ మందితో వీడియో కాల్ నిర్వహించే అవకాశం ఉండడంతో జూమ్ యాప్ కు గిరాకీ పెరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భారత్ లోనూ వర్క్ ఫ్రమ్ హోం విధానం పాటిస్తుండడంతో ఈ యాప్ ను మనవాళ్లు కూడా ఉపయోగిస్తున్నారు.

 అయితే ఈ యాప్ ఏమంత సురక్షితం కాదని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. జూమ్ ద్వారా నిర్వహించే వీడియో కాల్స్ కు సంబంధించిన డేటా భద్రతపై అనుమానాలున్నాయని కేంద్రం పేర్కొంది.  నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూమ్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ ను దేశీయంగా అభివృద్ధి చేయాలంటూ ఔత్సాహికులను కోరింది. 

కొత్తగా రూపొందించే యాప్ అన్ని మొబైల్ ఫోన్లలో పనిచేసే విధంగా ఉండాలని, నెట్వర్క్ సిగ్నళ్లు సరిగా లేని ప్రదేశాల్లోనూ మెరుగైన పనితీరు కనబర్చాలని, భద్రతకు పెద్దపీట వేసేలా ఉండాలని, తక్కువ శక్తితో పనిచేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ యాప్ చాలెంజ్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వం జూలై 29న ప్రకటిస్తారు. విజేతలకు రూ.1 కోటి బహుమతితో పాటు కేంద్రం నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక కార్యకలాపాల ఈ యాప్ నే వాడతారు. ఈ కింది లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  (https://secure.mygov.in/task/innovation-challenge-development-video-conferencing-solution/)

 

Leave a Comment