కరోనా కోసం గూగుల్ వెబ్ సైట్

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు, ఈ వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తదితర సమాచారాన్ని అందించేందుకు ఈ కొత్త సైట్ ను ప్రారంభించింది. 

కరోనా కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్ సైట్ ద్వారా  తీసుకొని ప్రజలను పరీక్షా సైట్ లకు నిర్దేశించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో google.com/covid19  అనే వెబ్ సైట్ ను గూగుల్ తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ లోె కోవిడ్-19 సమాచారం రాష్ట్రాల ఆధారంగా, భద్రత, నివారణ మార్గాలతో పాటు, కోవిడ్ సంబంధ సెర్చ్, ఇతర సమాచాారం లభిస్తుందని గూగుల్ తెలిపింది. అమెరికాలో ప్రారంభించిన ఈ వెబ్ సైట్ రానున్న రోజుల్లో ఇతర దేశాలు, మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని లాంచ్ సందర్భంగా గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మరిని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చనప్పుడు వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తామని పేర్కొంది. సెర్చ్ ఫలితాల్లో, గూగుల్ మ్యాప్స్ లో నేరుగా కరోనా వైరస్ గురించి నమ్మదగిన సమాచారం అందేలా చేస్తామని సెర్చ్ దిగ్గజం తెలిపింది. 

 

Leave a Comment