రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అట..!

ఇది మీకు వింతగా అనిపంచవచ్చు. అదేంటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ భార్య కదా అనుకుంటున్నారు కదూ… అవును విరాట్ కోహ్లీ భార్యే.. కానీ గూగుల్ లో ‘రషీద్ ఖాన్ భార్య’ అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరును చూపిస్తోంది.. ఆమె ఫొటోలు కూడా పాపల్ అవుతున్నాయి. నిజానికి రషీద్ ఖాన్ కు, అనుష్క శర్మకు సంబంధమే లేదు. అసలు రషీద్ ఖాన్ కు  పెళ్లే కాలేదు. మరీ అలా ఎందుకు చూపిస్తుంది అని మీ సందేహమా?

అసలు ఏం జరిగింది అంటే 2018 లో రషీద్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో తన ఫేవరెట్ హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. అప్పుడు ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. రషీద్ ఖాన్ ఫేవరేట్ అనుష్క శర్మ అని వార్తలు ఎక్కువగా వచ్చాయి. అంతే కానీ రషీద్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదు. నమ్మకం కలగడ లేదా?.. కావాలంటే మీరు గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి మరీ..

Leave a Comment