భారత్ లో గూగుల్ రూ.75 వేల కోట్లు పెట్టుబడి..!

భారత్ లో Google భారీ పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. Google India Digitization Fund పేరుతో వచ్చే 5-7 ఏళ్లలో భారత్ లో రూ.75 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు Google CEO  Sundar Pichai ప్రకటించారు. ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్స్, పార్ట్ నర్ షిప్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్, ఎకోసిస్టమ్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ భవిత్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తమకున్న నిదర్శనానికి ఈ భారీ పెట్టబడులే నిదర్శనం అని చెప్పారు. భారత డిజిటైజేషన్ లో కీలకమైన నాలుగు రంగాలపై దృష్టి పెట్టినట్లు సుందర్ పిచాయ్ వివరించారు. 

ప్రధానితో వర్చువల్ సమావేశం అనంతరం Sundar Pichai ఈ పెట్టుబడిని ప్రకటించారు. భారత్ తన ఆవిష్కరణల నుంచి లాభం పొందడమే కాకుండా దానిని నడిపించాలని కోరుకుంటున్నట్లు పిచాయ్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తన సొంత భాషలో సమచారాన్ని చేరవేయడం, భారత్ కు అవసరమైన కొత్త సేవలు, ఉత్పత్తులను ప్రారంభించడం, వ్యాపారాన్ని శక్తివంతం చేయడం, ఆరోగ్యం, విద్య మరియు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెంచడం వంటి అంశాలపై కేంద్రీకరించినట్లు వెల్లడించారు. 

 

Leave a Comment