గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..

కరోనా వైరస్ తో ప్రభావంతో ప్రపంపం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో సామాన్యులు పనులు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్తను అందించింది. ఎల్పీజీ సిలెండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలెండర్(14కేజీల) ధరపై రూ.65 మేరకు అన్ని మెట్రో నగరాల్లోనూ తగ్గించింది. ఈ ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. 

ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఎల్పీజీ సిలెండర్ ధరపై రూ.61.5 , రూ.65, రూ.62, రూ.64.5 మేరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో రూ.744, కోల్ కతాలో రూ.774.5, ముంబైలో రూ.714.5, చెన్నైలో 761.5గా ధరలు ఉన్నాయి. కాగా కమర్షియల్ సిలెండర్ల రేట్లు యధాతథంగా ఉంటాయి. 

Leave a Comment