ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బోర్ వేల్స్..

రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద పేద రైతులకు ఉచితం బోర్లు వేల్స్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఈ పథకాని్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. బోరు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే  బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలి. భూగర్భ జల మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. 

విధివిధానాలు..

  • రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న  రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
  • అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళ్తుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. 
  • బోరు బావి మంజూరు అనంతరం ఆ సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. 

Leave a Comment