గుడ్ న్యూస్ : ఆగస్టు 10లోపు కరోనా వ్యాక్సిన్ రెడీ..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు చెక్ పెట్టే టైం దగ్గర్లోనే ఉంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్ అందించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు రేసులో ఉన్నాయి. తాము ముందు వ్యాక్సిన్ కనుగొంటామనంటే తాము కనుగొంటామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని ఆగస్టు 10లోపు విడుదల చేస్తామని రష్యా ప్రకటించింది. ముందుగా వైరస్ బారిన పడిన వైద్యులకు అందించి, తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేవాలని రష్యా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రష్యాలోని సెషనోవ్ వర్సీటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శస్త్రవేత్తలు తెలిపారు. అటు అమెరికన్ కంపెనీ మోడెర్నా తయారు చేస్తున్న టీకా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ టీకా కూడా మూడో దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోపు ఏదో ఒక వ్యాక్సిన్ రావచ్చని ఆశలు రేపుతున్నాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కూడా ఆగస్టు మూడో వారంలో వచ్చే అవశాకం ఉందని ఐసీఎంఆర్ అంచనా.  

 

Leave a Comment