కుక్కకు బంగారు విగ్రహం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా నాయకుల విగ్రహాలు, దేవతల విగ్రహాలు ప్రతిష్టించడం చూశాం.. కాని కుక్క విగ్రహం ప్రతిష్టించడం ఎక్కడైనా చూశారా? అది కూడా బంగారంతో చేయించాడు. ఆ కుక్క విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ప్రతిష్టించాడు. ఇంతకు ఆ బంగారు కుక్కను ఎక్కడా ప్రతిష్టించారు అనుకుంటున్నారా? 

ఇది చేసింది తుర్క్ మెనిస్తాన్ అధ్యక్షుుడు గర్బాంగులీ బెర్దిముకమెదోవ్. ఇతనికి పశ్చిమాసియాకు చెందిన అలబామ్ జాతి కుక్కలు అంటే చాలా ఇష్టం..అందుకే ఈ కుక్క జాతి గుర్తుగా ఏదైనా చేయాలనుకున్నాడు. దీంతో ఆ కుక్కకు బంగారు విగ్రహం చేయించాడు. ఆ విగ్రహాన్ని దేశ రాజధాని యాష్గబట్ లోని ఓ ప్రసిద్ధ కూడలిలో ప్రతిష్టించాడు. 

అంతే కాదు ఈ విగ్రహం కింద ఉండే స్క్రీన్ పై అలబాయ్ కుక్కల వీడియోలను చూడవచ్చు. ఈ జాతి కుక్కలు చాలా బాగా కాపలా కాస్తాయి. పులులు, తోడేళ్లను సైతం తరిమికొట్టే సత్తా ఈ క్కుక్కలకు ఉందట. అందుకే ఈ కుక్కలను మధ్య ఆసియా గొర్రెల కాపరి అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ కుక్క విగ్రహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment