బంగారం ధర కొత్త రికార్డు..ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి..!

బంగారం ధర రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సామన్య ప్రజలు బంగారం కొనాలంటే బెంబెలెత్తిపోయేలా ఉంది. బంగారం ధర భారీగా పెరగడంతో ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరింది. 

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఒకే రోజు రూ.520 పెరగడంతో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.46,090కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.570 పెరగడంతో రూ.50,270కు చేరి కొత్త రికార్డు సృష్టించింది. 

వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఒకే రోజు రూ.620 పెరగడంతో రూ.48,670గా పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర ఔన్స్ కు 0.60 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ కు 1763 డాలర్ల పైకి చేరింది. 

Leave a Comment