తగ్గుతున్న పసిడి ధరలు

ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కరోనా భయాలు బంగారం డిమాండ్ ను తగ్గిస్తాయనే ఆందోళన బులియన్ మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. సంక్షోభ సమయంలో షేర్లు, కరెన్సీల వైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.492 తగ్గి రూ.43,350 పలికింది. ఇక కిలో వెండి రూ.379 తగ్గి రూ.39,419కి దిగివచ్చింది. కరోనా ఆందోళనతో మరికొన్ని రోజులు హాట్ మెటల్స్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Leave a Comment