బంగారం రూ.50 వేలకు చేరే అవకాశం

బంగారం ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. ఒకేసారి ఆల్ టైం హై రేటుకు చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ఒకేసారి రూ.44,380లకు చేరుకుంది. దాదాపు 20 రోజుల్లోనే 4 వేల రూపాయలకు పైగా పసిడి ధర పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా వచ్చే నెల మొదటి వారానికి రూ.50వేలకు చేరే అకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఎంత పెరిగినా.. వినియోగదారులు కొనడానికి రెడీ అయ్యారు. దీంతో పసిడికి డిమాండ్ బాగా పెరిగింది. రూ.700  తేడాతో..45 వేల రూపాయలకు దగ్గరపడింది. కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,740 గా ఉంది. వచ్చే వారం లేదా వచ్చే నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. అంతకంతకూ పసిడి ధరలు పెరుగుతున్నాయే తప్ప..తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

Leave a Comment