హెలికాప్టర్ కొనేందుకు రుణం ఇవ్వండి.. రాష్ట్రపతికి ఓ మహిళ లేఖ..!

మధ్యప్రదేశ్ లోని మాండ్ సౌర్ జిల్లాకు చెందిన ఒక మహిళ రాష్ట్రపతికి లేఖ రాసింది. తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇప్పించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం జరిగిందంటే.. మధ్య ప్రదేశ్ లోని మాండ్ సౌర్ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో నివసిస్తున్న బసంతి బాయికి గ్రామంలో పొలం ఉంది. 

ఆ పొలం సరిహద్దుల్లో ఉన్న మరో పొలం యజమాని ఆమె పొలానికి దారి మూసివేశాడు. దీంతో తన పొలానికి చేరుకోవడం ఆమెకు అసాధ్యంగా మారింది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసింది. అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

దీంతో బసంతి బాయికి చిర్రెత్తుకొచ్చింది. తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన సమస్యపై రాష్ట్రపతికి ఒక లేఖ రాసింది. తన పొలంలోకి వెళ్లేందుకు హెలికాప్టర్ కొనేందుకు రుణం ఇప్పించాలని కోరింది. ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ లేఖ నెట్టింట్లో వైరల్ అయింది. 

ఈ వార్త మీడియా దృష్టికి వచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే యశ్ పాల్ సింగ్ ఈ వార్తపై స్పందించారు. బసంతి బాయికి తాను సహాయం అదిస్తారన్నారు. ఆమె పొలానికి చేరుకోలేకపోతే, ఆమె సమస్యను పరిష్కరించేందుకు తాను సహాయం చేస్తానని చెప్పారు. కానీ ఆమెకు హెలికాప్టర్ ఇవ్వడం ద్వారా కాదని అన్నారు. ఇప్పటి వరకు ఈ లేఖ రాష్ట్రపతికి అయితే పంపబడలేదు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంద. 

Leave a Comment