అబ్బాయిలు చేసే ఈ పనులు అమ్మాయిలకు అస్సలు నచ్చవట..!

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్.. మీరు దీన్ని వినే ఉంటారు.. ఇది ఇంటర్వ్యూ అయినా లేదా మరేదైనా మొదటి సమావేశమైనా.. మన ప్రవర్తన సరిగ్గా ఉంచుకోవాలని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే మన మొదటి సమావేశం ఎదుటి మనిషిలో మనం మంచి వ్యక్తి లేదా చెడు వ్యక్తి అనే ఈమేజ్ ని సృష్టిస్తుంది.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో క్లారిటీగా ఉంటారు. మన ప్రవర్తనను బట్టి మనం ఎలాంటి వారు అంచనా వేస్తారు.. అందుకే మన ప్రవర్తన పట్ల మనం జాగ్రత్తగా ఉంటాలి. అబ్బాయిలు తమ ప్రవర్తనలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా సార్లు అబ్బాయిలు తెలియకుండానే ఇలాంటి తప్పులు చేస్తుంటారు. మరీ అబ్బాయిలు చేయకూడని ఆ పనులు ఏంటో చూద్దాం.. 

తదేకంగా చూస్తూ ఉండటం:

సాధారణంగా అబ్బాయిల ముందు అమ్మాయిలు వచ్చినప్పుడు.. వారిని పై నుంచి కింది వరకు చూస్తూ ఉంటారు. ఇది అమ్మాయిలకు నచ్చదట.. అందుకే అలాంటి వారితో అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరట.. 

అనవసరమైన కామెంట్లు:

అమ్మాయిలపై అనవసరమైన కామెంట్లు చేసే అబ్బాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల అమ్మాయిల మనసులో మీ గురించి చెడు అభిప్రాయం కలుగుతుంది. అమ్మాయిలు అలాంటి అబ్బాయిలతో మాట్లాడటానికి అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. 

పదే పదే టచ్ చేయడానికి ప్రయత్నించడం:

చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలను పదేపదే టచ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వారిని చేతులతో కొట్టడం, భుజం మీద చేయి వేసుకోవడం వంటి అలవాటు ఉంటుంది. మీరు ఇలా చేస్తుంటే అమ్మాయిలు మీతో మాట్లాడకుండా పారిపోతారు.

వల్గర్ టాక్:

ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఒక్కోసారి అమ్మాయిల ముందు అబ్బాయిలు వల్గర్ గా మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడట్ం అమ్మాయిలకు నచ్చదట. వారు చాలా అసౌకర్యానికి గురవుతారు. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలి.. 

Leave a Comment