లావుగా ఉన్నాడని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. ఇప్పుడెలా మారాడో చూడండి..!

ప్రేమకు చాలా శక్తి ఉంటుందని అంటారు. కానీ ఈ కుర్రాడు బాధలో కూడా ఎంతో శక్తి ఉంటుందని నిరూపించాడు! అవును, సోషల్ మీడియాలో ఈ ‘టిక్‌టాక్’ యూజర్ రూపాంతరం చెందిన చిత్రాలు, వీడియోలతో పాటు, అతని కథ కూడా వైరల్ అవుతోంది! నిజానికి, ఆ వ్యక్తి అధిక బరువుతో ఉన్నాడని అతని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. ఆ బాధలో అతడు ఎలా మారాడంటే.. ఇప్పుడు అందరూ అతని స్ఫూర్తిని అభినందిస్తున్నారు!

గర్ల్ ఫ్రెండ్ బ్రేక్ అప్ చెప్పినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడే తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన లైఫ్ స్టయిల్ మార్చుకోవడమే కాకుండా జిమ్ లో వర్క్ అవుట్స్ చేశాడు. ఒకప్పుడు పువీ బరువు 144 కిలోలు ఉండేవాడు. అసలు బరువు తగ్గుతానా అనే అనుమానం ఉండేది.. కానీ అతడి ఫ్రెండ్ తనుకు ధైర్యం చెప్పాడు. దీంతో కష్టపడి కసరత్తులు చేసి తన శరీర బరువును తగ్గించుకున్నాడు. సోషల్ మీడియాలో అతడు తన మార్పుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను షేర్ చేశాడు. 

ఇన్ స్టాగ్రామ్ తో తన రెండు ఫొటోలను షేర్ చేస్తూ.. మొదటి ఫొటో.. జనవరి 14, 2021 సంవత్సరంలోనిది. ఈ సమయంలో అతని బరువు 144 కిలోలు. రెండో ఫొటో ఫిబ్రవరి 8, 2022. అప్పుడు అతని బరువు 74 కిలోగ్రాములు. ‘నేను ఒక కొత్త వ్యక్తిగా భావిస్తున్నాను.  మొదటి చిత్రంలో నా కళ్లలో దుఃఖం స్పష్టంగా కనిపిస్తోంది. నేను చాలా పనికిరాని వాడిలా అనిపించేది. ఇప్పుడు నన్ను నేను మార్చుకున్నాను. నేను కొత్త జీవతాన్ని పొందాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటూ పోస్టులో రాసుకొచ్చాడు. 

 

Leave a Comment