తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండండి : WHO

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో బాంబు పేల్చారు. ప్రపంచ తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా మహమ్మారి చివరి మహమ్మారి కాదని స్పష్టం చేశారు. తరువాతి కాలంలో మరిన్ని ప్రాణాంతక మహ్మారులు వచ్చే అవకాశం ఉందని అధనామ్ పేర్కొన్నారు. భవిష్యత్ లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. 

WHO హెచ్చిరకపై పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ప్రజలను మళ్లీ నిరాశకు గురి చేసే ముందు, ప్రస్తుత మహమ్మారి నుంచి బయటపడనివ్వండి అంటూ ట్వీట్ చేశారు. మమ్మల్ని మరింతగా భయపెట్టొద్దని, మమ్మల్ని మళ్లీ డిప్రెషన్ లో ముంచొద్దని పేర్కొన్నారు. 

 

Leave a Comment