ఘనంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు..!

ఒకప్పుడు కేవలం విదేశాల్లో జరిగే గే మ్యారేజ్ ట్రెడిషన్ ఇప్పుడు ఇండియాలోనూ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. అది కూడా పెద్దలు, అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఈ వివాహానికి కోల్ కతా వేదికగా మారింది. 

అభిషేక్ రే, చైతన్య శర్మ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 200 మంది అతిథుల సమక్షంలో పెద్దల ఆశీర్వాదంతో వీరి వివాహం ఘనంగా జరిగింది. మంగళ స్నానాలు, మేళ తాళాలతో స్వలింగ జంట ఆనందంతో వేడుకను జరుపుకుంది. ఒకరి మెడలో మరొకరు పూల దండలు వేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయటంతో వైరల్‌ అయ్యాయి.

తాజ్ మహల్ వద్ద ప్రపోజ్:

అభిషేక్ రే కోలకతాలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.. చైతన్య గురుగ్రామ్ లో డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ గా ఉన్నారు. అలా ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడి ప్రేమించుకున్నారు. తాజ్ మహల్ వద్ద అభిషేక్ కి చైతన్య లవ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై నిల్చుని రింగ్ తొడుగుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. పెళ్లి గురించి చాలా కష్టపడి తమ పెద్దలను ఒప్పించినట్లు అభిషేక్ తెలిపాడు.  

Leave a Comment