తెరపై గుంగూలీ బయోపిక్..!

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. కపిల్ దేవ్ బయోపిక్ 83 కూడా తెరకెక్కుతోంది. 

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ కు రంగం సిద్ధమైంది. తన బయోపిక్ తెరకెక్కించేందుకు దాదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ బయోపిక్ హిందీలో మాత్రమే తెరకెక్కబోతుందని దాదా వెల్లడించారు. 

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా తన బయోపిక్ కు సంబంధించిన విశేషాలను ప్రస్తావించాడు. లీడ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. అయితే డైరెక్టర్ ఎవరన్నది చెప్పలేదు. బయోపిక్ పై అధికారిక ప్రకటన రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపాడు. 

 

 

Leave a Comment