ఫన్నీ వీడియో : గ్రౌండ్ లోనే జెర్సీ మార్చుకుంటూ బౌండరీ మిస్ చేశాడు..!

అబుదాబి టీ10 లీగ్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నార్తన్ వారియర్స్ మరియు టీం అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. టీం అబుదాబి ఫీల్డర్ రోహన్ ముస్తాఫా గ్రౌండ్ లోనే తన జెర్సీ మార్చుకుంటున్నాడు. ఆ సమయంలో బ్యాట్స్ మెన్ బాల్ న బౌండరీ వైపు కొట్టాడు. 

ఆ బాల్ రోహన్ ముస్తాఫా వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో రోహన్ తన జెర్సీ వేసుకోవడం మధ్యలోనే ఉండటంతో అతడు బాల్ వెనుక పరిగెత్తినా దానిని ఆపలేకపోయాడు. దీంతో అది కాస్తా బౌండరీ లైన్ దాటింది. ఇది చూసిన టీమ్ తో పాటు ప్రత్యర్థి టీమ్ ప్లేయర్స్ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment