రష్యా వ్యాక్సిన్ కు ఫుల్ క్రేజ్..20 దేశాల నుంచి ప్రీ ఆర్డర్..!

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను రష్యా అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ‘స్పుత్నిక్ వీ’ పేరుతో ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్ యొక్క  ఫేస్-3 ట్రయల్స్  బుధవారం నుంచి ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కిరిల్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 20 దేశాలు బిలియన్ డోసుల కంటే ఎక్కువగా ముందస్తు ఆర్డర్ చేసినట్లు కిరిల్ తెలిపారు. విదేశీ భాగస్వాములతో పాటు సంవత్సరానికి 500 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీకి రష్యా సిద్ధంగా ఉందని వివరించారు. 

Leave a Comment