పెట్రోల్ లేక.. వారంపాటు స్కూళ్లు బంద్..!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకాయి.. దేశంలో చమురు కొరత వేధిస్తోంది.. రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజుల పాటు మూసివేశారు.. 

శ్రీలంకలో కేవలం ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రం చమురు లభిస్తోంది. ఆయిల్ కంపెనీలు కూడా శ్రీలంకకు క్రెడిట్ పై చమురు విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. చముదరు సంక్షోభంతో జూన్ 18 నుంచి దేశంలో స్కూళ్లను ప్రభుత్వం బంద్ చేసింది. 

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని, అయితే ట్రాన్స్ పోర్టేషన్ తో సంబంధం లేని విద్యార్థులను మాత్రమే స్కూళ్లకు అనుమతించాలని చెప్పారు. ఆన్ లైన్ క్లాసులకు ఇబ్బందులు కలుగకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.    

 

Leave a Comment