పెళ్లయిన తర్వాత క్రికెట్ కు అనుమతివ్వాలి.. వధువుతో అగ్రిమెంట్ రాయించుకున్న వరుడి మిత్రులు..!

వరుడి స్నేహితులు వధువుతో చేయించుకున్న ఓ అంగీకరా ఒప్పందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. పెళ్లియ్యాక కూడా తమతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఘటన మధురై జిల్లా ఉసిలంబట్టిలో చోటుచేసుకుంది.. 

వివరాల్లోకి వెళ్తే.. ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ తేనిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.. హరిప్రసాద్ కి తేనీకి చెందిన పూజతో శుక్రవారం పెళ్లి నిశ్చయించారు. 

వరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.. స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్ ఆడేవాడు. ఈక్రమంలో పెళ్లికి వచ్చిన వరుడి స్నేహితులు పెళ్లి తర్వాత కూడా హరిప్రసాద్ ని క్రికెట్ ఆడడానికి అనుమతివ్వాలని వధువును కోరారు. శని, ఆదివారాల్లో వరుడు క్రికెట్ ఆడేందుకు ఆమె ఒప్పుకుంది. 

అయితే అది రాత పూర్వకంగా ఉండాలని వారు కోరారు. దీంతో పెళ్లి కూతురు అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక భార్యలు తమ భర్తలను క్రీడల్లో పాల్గొనకుండా అడ్డుకుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో వరుడి చేత అంగీకార ఒప్పందం చేసుకున్నారు. 

 

Leave a Comment