వధువు చేయిపట్టి లాగిన వరుడి ఫ్రెండ్స్.. ఆగిపోయిన పెళ్లి..!

కొద్ది పేపట్లో పెళ్లి.. అతిథులు, బంధుమిత్రలు అందరూ హాజరయ్యారు. ఓ వైపు సంగీత్ కార్యక్రమం జరుగుతోంది. మద్యం మత్తులో వరుడి స్నేహితులు డ్యాన్స్ చేయాలంటూ వధువు చేయిపట్టుకుని బలవంతపెట్టడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో చోటుచేసుకుంది. 

కనౌజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్ది నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 11న ముహూర్తం నిర్ణయించారు. దీంతో బరేలిలోని పెళ్లి కుమారిడి ఇంటికి పెళ్లి కూతురి తరపువారందరూ చేరుకున్నారు. కొద్ది సేపట్లో తాళి కట్టాలి. ఆ సమయంలో పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతురును డ్యాన్స్ చేయాలంటూ డ్యాన్స్ చేసే వేదికపై లాక్కెళ్లారు. 

ఇలా చేసేందుకు పెళ్లికుమార్తె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈనేపథ్యంలో పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య రాజీకుదిర్చిన పోలీసులు వధువు కుటుంబానికి వరుడి తల్లిదండ్రులు రూ.6.5 లక్షలు చెల్లించాలని సూచించారు. పెళ్లి జరిపించాలని వరుడి తరపు వారు కోరినా.. వధువు నిరాకరించింది. తనకు మర్యాద ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది. 

 

Leave a Comment