కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా ఇంటర్నెట్..!

కేరళ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్‌ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20లక్షలకు పైగా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధమవుతోంది.  కేరళ ఫైబర్ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తొలిదశలో 14వేల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లను ఇవ్వనున్నారు.

రూ.1548 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. జూన్ చివరి కల్లా ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్‌ విభాగం నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ అందిన వెంటనే సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..

ఉచిత ఇంటర్నెట్‌ పథకంలో భాగంగా కేరళలోని 140నియోజక వర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 100ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వనున్నారు. లబ్దిదారులకు 50ఎంబిపిఎస్‌ స్పీడ్‌తో 1.5జిబి డేటా ఇస్తారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత సబ్సిడీ ధరలతో ఇంటర్నెట్ అందిస్తారు. కేరళలో 20లక్షల బీపిఎల్‌ కుటుంబాలకు ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో విజయన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

 

Leave a Comment