కరోనా రాదని పచ్చి చేపను తిన్న మాజీ మంత్రి.. అది కూడా లైవ్ లో.. వీడియో వైరల్..!

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఏది తినాలన్నా భయపడిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అబ్బో ఇవి తింటే కరోనా వస్తది.. అది తింటే కరోనా వస్తది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చేపలు తినటం వల్ల కూడా కరోనా వస్తుంది అనే వదంతులు వ్యాపించాయి. 

తాజాగా శ్రీలంకలోని కొలం శివార్లలో ఉన్న సెంట్రల్ ఫిష్ మార్కెట్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దీంతో ఈ వదంతులు మరింత విస్తృతమై శ్రీలంకలో చేపల అమ్మకాలు తగ్గిపోయాయి. శ్రీలంకలోని చాలా ప్రాంతాల్లో చేపలను తినడం లేదు. ఈనేపథ్యంలో ఈ వదంతులకు చెక్ పెట్టేందుకు శ్రీలంకలోని ఓ మాజీ మంత్రి రంగంలోకి దిగారు. 

సీఫుడ్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అవి అన్నీ పుకార్లే అని మాజీ మంత్రి దిలీప్ వెదారాచ్చి అన్నారు. చేపలు తింటే కరోనా రాదన్నారు. తానే మీ ముందు చేపను తింటున్నానంటూ లైవ్ లో పచ్చి చేపను తిన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా చేపలను తినాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.  

Leave a Comment