ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా..!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కేబినెట్ ఏర్పడింది.. అయితే ఈ కేబినెట్ పై చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. మరో వైపు తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కకపోవడంపై పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కేబినెట్ లో చేసిన మంత్రులు సైతం తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త కేబినెట్ వైసీపీలో చిచ్చు రేపినట్లయింది. 

తాజాగా మాజీ హోమ్ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తన పదవికి రాజీనామా చేయనున్నట్ల ప్రకటించారు. సోమవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

 ‘మంత్రి పదవి రెండున్నరేళ్లే అని జగన్ ముందే చెప్పారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదు. కానీ.. కొన్ని కారణాలు నన్ను బాధించాయి. నా వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటా. నా వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు. పదవిలో ఉన్నా లేకుపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. పార్టీ కార్యకర్తలంతా సంయమనం పాటించాలి’ అంటూ సుచరిత పేర్కొన్నారు. 

 

 

 

Leave a Comment