కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు జైల్లోనే ఆత్మహత్య..!

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు.. జైల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

రాంపల్లి ప్రాంతంలో 28 ఎకరాల భూమి సెటిల్మెంట్ విషయంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. దానికి సంబంధించిన కోటి పది లక్షల రూపాయల డబ్బును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్ గా ప్రచారం కూడా జరిగింది.  

Leave a Comment