గర్భం దాల్చిన స్త్రీ తినకూడని ఆహారాలివే..!

పెళ్లి అయినా ప్రతి జంట ఎన్నో కోరికలతో, ఆశలతో ఉంటారు. అందులో ముఖ్యంగా పిల్లలు ఎప్పుడు వస్తారో మన లైఫ్ లోకి అని అనుకుంటా ఉంటారు. తల్లిగా మారాలి అని ప్రతి పెళ్లి అయినా అమ్మాయి ఆశపడుతుంది. గర్భము దాల్చిన తరవాత చాలా ఆనంద పడుతుంది. ఇంకా ఆ ఇంటిలోని సభ్యలు సంతోషానికి అవధులు ఉండవు. ప్రెగ్నన్సీ అని తెలిసినప్పటి నుంచి ప్రసవము అయ్యే అంత వరకు ఆరోగ్యం విషయములో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 ఏ పదార్థాలు తినకూడదు, కూర్చోవడం, లేవడం, నడవడం ఇలా ప్రతి చిన్న విషయం మీద తగిన శ్రద చూపించాలి. కడుపులో ఉన్న బిడ్డ బాగా అందంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి తీసుకొనే డైట్ మీద, జాగ్రత్తలు మీద ఆధారిపడి వుంటుంది. ఈ సమయములో చాలా మంది అనేక విషయాలు చెపుతారు, కొంతమంది కొన్ని పదార్ధాలు తిన్నాకూడదు అంటారు. అవి తినడము వలన గర్భము నిలవదు అని అంటారు. ఇప్పుడు మీ అందరి కోసము గర్భధారణ సమయములో తినకూడని పదార్ధాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు ఆరోగ్యానికీ చాలా మంచిది. గర్భము దాల్చిన సమయంలోను పండ్లు తీసుకోవడము మంచిది కాని కొన్ని పండ్లు తినకపోవడము మేలు. అవి ఏమిటో ఇప్పుడు చూదాం. పైనాపిల్‌లో ఉన్న బ్రోమెలైన్ అనే సమ్మేళనం గర్భాశయాన్ని మృదువుగా చేయడానికి దారితీస్తుంది, ఇది గర్భస్రావంకి కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో బొప్పాయి తినకపోవడమే మంచిది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. నిజానికి, పచ్చి బొప్పాయిలో పపైన్ అనే  రసాయనం ఉంటుంది. దీని కారణంగా కడుపులో పెరుగుతున్న పిండంలో కొన్ని లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు అబార్షన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి.

చేపలు తినడము మన ఆరోగ్యానికీ చాలా మంచిది.చేపలు తినడం వల్ల విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తదితర ముఖ్యమైన పోషకాలు శరీరానికి చక్కగ అందుతుంది.కొన్ని చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకంటే అవి అపరిశుభ్రము లేని ప్రదేశంలో పెరిగి ఏదో ఓక రకము క్రీములు అంటించుకొని వుంటుంది. ఇలాంటి చేపలను తింటే గర్భస్రావం కలిగే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. అందువల్ల గర్భధారణ సమయంలో చేపలు తీసుకోకపోవడం మంచిది.

గర్భధారణ సమయంలో వంకాయ తినడం, మంచిది కాదు.ఎందుకంటే ఇది సాధారణంగా అమెనోరోయా మరియు ప్రీమెన్స్ట్రువల్ డిజార్డర్ చికిత్సకు తీసుకుంటుంది.అంతే కాకుండా వంకాయ వేడి చేస్తుంది.అందువలన వంకాయకి దూరముగా ఉండడము తల్లి అయ్యే అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి. అజినోమోటో ఉండే ఆహారము  గర్భం సమయములో తీసుకోకూడదు. ఇది ఎక్కువగా  నూడుల్స్ లో చైనీస్ ఆహారం లో ఉంటుంది. 

మెంతులు గర్భిణీ స్త్రీలకు ప్రమాదం, ఎందుకంటే అవి గర్భస్రావం చెయ్యగలవు. అంతేకాక, కొన్ని మందులు మెంతి విత్తనాల పట్ల రియాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. అందువల్ల, మెంతుల వినియోగం గురించి మీ వైద్యుడి అభిప్రాయాన్ని తీసుకోవడం చాలా మంచిది. అధిక క్యాలరీలు ఉన్న  ఆహార పదార్థాలను అసలు తినకూడదు. కాబట్టి  గర్భిణీలు ఉడకని మాంసం, సీఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం, బయట దొరికే గోబీలు, పానీపూరీలు, కాల్చిన మాంసం ఇలాంటివి తినకూడదు.

 

Leave a Comment