మధుమేహం సమస్య వేధిస్తోందా..తగ్గాలంటే ఈ పద్దతులు పాటించండి..!

మధుమేహం దీనిని డయబెటీస్, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఇప్పటి సమాజములో ఆహార అలవాట్లు వలన తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా  ఈ వ్యాధి వస్తుంది. శరీరంలో ఉండే చక్కెర  హెచ్చు తగ్గుల వల్ల ఈ మధుమేహం వస్తుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన ఆహారము తీసుకొంటే మధుమేహం పూర్తిగా తగ్గుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు.

వీరంతా సరైన ఆహార నియమాలు,పాటించడము వలన మధుమేహాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నారు.మధుమేహం ఈ కారణాల వల్ల కూడా వస్తుంది.శరీరానికి శ్రమ పెట్టకుండా,ఖాళీగా ఎక్కువ సేపు ఓకే చోట కూర్చోవడము వలన, పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల ప్రభావాలు వలన ఈ వ్యాధి వస్తుంది.

ఈ పనులు చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది అని నిపుణులు చెపుతున్నారు.అవి ఏమిటి అంటే వాకింగ్  చేస్తే డయాబెటిస్​ అదుపులో పెట్టవచ్చు. రాత్రి భోజనము తర్వాత కొంత దూరము నడవడం మంచిది.ఇలా నడిస్తే చాలా వరకు ఈ వ్యాధి తగ్గుతుంది అని నిపుణులు అంటున్నారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు.

వెల్లుల్లితో మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి.శరీరంలోని అనేక రకాల వ్యాధులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వెల్లుల్లి రసం తాగడం కూడా ఈ వ్యాధి తగ్గడానికి ఒక మంచి ఉపయోగం.ఇలా కూడా చేయలేం అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని వాటిని కాల్చి తినవచ్చు.ఇక ఆస్తమా శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పని చేస్తుంది.

ఈ వ్యాధి తగ్గడానికి శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి.రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి.ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో పైకి లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి.జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి. 

మధుమేహం ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. గర్బిణీలకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి.ఈ సమస్య వస్తుంది.గర్భంతో ఉన్నప్పుడు తప్పకుండా మధుమేహం పరీక్షలు కూడ  చేసుకోవాలి.  కొందరిలో ప్రసవం తర్వాత కూడా మధుమేహం కొనసాగవచ్చు. శరీరానికి ఎంత కావాలో అంతే తినండి.

 

Leave a Comment