గాల్లో ఎగిరే దోశ.. వీడియోకు కోట్లలో వ్యూస్..!

సాధారణంగా దోశ వేసిన తర్వాత దానిని ప్లేట్ లో తీసేటప్పుడు ఎక్కడ కింద పడిపోతుందో అని జాగ్రత్తగా తీస్తాం.. కానీ ఓ వ్యక్తి మాత్రం దోశలు వేసినే తర్వాత వాటిని డైరెక్టుగా కస్టమర్ ప్టేట్లలో మామూలుగా కాకుండా గాల్లో విసేరేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశేషం ఏంటంటే ఆ వీడియోకు కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 8.44 కోట్ల వ్యూస్ వచ్చాయి. 

ముంబైలోని మంగళ్ దాస్ మార్కెట్ లో టిఫిన్ సెంటర్ నిర్వహించే ఓ వ్యక్తి దోవలు వేసిన తర్వాత దానిని మడతపెట్టి కనీసం ప్లేట్ ఎక్కడ ఉందో కూడా చూడకుండా అలా పైకి విసిరేస్తాడు. దానిని పక్కన ఉన్న వ్యక్తి అందుకుంటాడు. ఇది అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతని టాలెంట్ ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే తినే తిండిని ఇలా అవమానిస్తావా అంటూ విమర్శిస్తున్నారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.