ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు.. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి..!

ప్రప్రంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో వెలుగు చూసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఈమేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. 

విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. తర్వాత ఆ వ్యక్తి నమూనాలను సీసీఎంబీకి పంపించగా ఒమిక్రాన్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ప్రజలు ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈకేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 34కి చేరాయి. 

Leave a Comment