కండోమ్ అయితే కాదు..

కరోనా అందరి జీవితాల్లో మార్పు తెచ్చేసింది. ఏది ముట్టుకోవాలన్నా భయపడాల్సి వస్తుంది. ఇక ఏటీఎంలలో అయితే డబ్బులు డ్రా చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏటీఎంలలో వందల మంది డబ్బలు డ్రా చేసుకుని వెళ్తుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉందో గుర్తుపట్టలేము. వారిలో కరోనా ఉన్న వాళ్లు ఉంటే మనకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. 

అయితే కరోనా కాలంలో కొన్ని సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. అచ్చం కండోమ్ రూపంలో ఉండే ఫింగర్ గ్లౌజ్ లను తయారు చేసి మార్కెట్ లో అమ్మకానికి పెట్టాయి. అయితే వినియోగదారులు మాత్రం వీటిని కొనేందుకు ఆలోచిస్తున్నారు. కండోమ్ మాదిరిగా ఉన్నందు వల్ల దీన్ని చూసిన వారు జోకులు వేసుకుంటున్నారు. 

Leave a Comment