మూత్రం రంగును బట్టి మీకున్న అనారోగ్య సమస్యలను తెలుసుకోండి..!

సాధారణంగా మూత్రం రంగు మారడం అనేది మనం నీరు తక్కువగా తాగినప్పుడు కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని రకాల ఔషధాలు తీసుకోవడం వల్ల కూడా రంగు మారుతుంది. అయితే మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే మనం విసర్జించే మూత్రం రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

మూత్రం రంగును బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు:

  • మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే తీవ్ర అనారోగ్య సమస్య వచ్చిందని అర్థం చేసుకోవాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చినా, కిడ్నీ స్టోన్లు ఉన్నా, మూత్రాశయంలో ట్యూమర్లు ఏర్పడినా ఇలా మూత్రంలో రక్తం వస్తూ మూత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణ రీతిలో మార్పులు వచ్చినా ఈ విధంగా మూత్రం ఎర్రగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మెర్క్యూరీ అనే లోహం శరీరంలో ప్రవేశించి పాయిజనింగ్ అవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి మూత్రం ఎరుపు రంగులో వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. 
  • వివిధ రకాల ఆహారాలను తిన్నప్పుడు మూత్రం ఆకుపచ్చ లేదా బ్లూ రంగులో వస్తుంది. అలాగే కీమోథెరపీ మందులను వాడుతుంటే మూత్రం నారింజ రంగులో, క్యారెట్లను అధికంగా తింటే లైట్ ఆరెంజ్ కలర్ లో, విటమిన్ సి ని అధికంగా తీసుకుంటే కూడా ఆరెంజ్ కలర్ లో మూత్రం వస్తుంది. ఇక బి విటమిన్లు ఎక్కువైతే మూత్ర గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇలా తరుచూ వస్తుంటే డాకర్ ను కలవాల్సిందే.. 
  • మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంటే అది కామెర్లు అయి ఉండొచ్చు. లేదా లివర్, మూత్రాశయం, క్లోమ గ్రంథి సమస్యలు కావచ్చు. అలాంటి సందర్భాల్లో మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంది. కనుక ఇలా వచ్చినా కూడా స్పందించాల్సిందే. కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ ను అధికంగా తాగినా, మద్యం ఎక్కువగా సేవించినా ఇలా మూత్రం డార్క్ బ్రౌన్ కలర్ లో వస్తుంది. 
  • మూత్రం స్పష్టంగా లేకుండా నలకల మాదిరిగా వస్తున్నా, మడ్డిగా ఉన్నా మూత్రాశయ ఇన్ ఫెక్షన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. 
  • మూత్రం దుర్వాసనతో వస్తుంటే అందుకు పలు కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎక్కువగా తింటున్నా లేదా మద్యం ఎక్కువగా సేవించినా, నీటిని సరిగ్గా తాగకపోయినా, డయాబెటీస్ సమస్య ఉన్నా, కిడ్నీ వ్యాధులు ఉన్నా మూత్రం డార్క్ కలర్ లో దుర్వాసనతో వస్తుంది. అందువల్ల ఈ విధంగా మూత్రం వచ్చినా కూడా వైద్యుడిని సంప్రదించాలి. 

Leave a Comment