వీడియో గేమ్స్ తో టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

కొన్ని రకాల వీడియో గేమ్స్ టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలను, కోపాన్ని, కసిని పెంచుతున్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. వీడియో గేమ్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తేల్చి చెప్పింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఇంట్లో హింసాత్మక వీడియో గేమ్స్, ప్లే స్టేషన్లను తీసేయాలని చెబుతోంది..

పిల్లల్లో కనిపించే లక్షణాలు :

వీడియో గేమ్స్ కి అలవాటు పడ్డ పిల్లల్లో ఈ లక్షణలు కనిపిస్తున్నాయేమో పరిశీలించండి.. ఉంటే పిల్లోడు ఏం ఆడుతున్నాడు.. ఇంట్లో అధికంగా ఏ పనిలో ఉన్నాడు గమనించండి.. వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు అయితే.. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో చూడండి.. టీనేజీ పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉంటున్నారంటే.. వారు ఏం చేస్తున్నారో గమనించాలి..  

  • ఔట్ డోర్ గేమ్స్ లో ఆసక్తి చూపించకపోవడం
  • నిద్రపోకపోవడం
  • చదువుపై ఆసక్తి లేకపోవడం
  • బరువు పెరగడం
  • నలుగురిలో కలవకపోవడం
  • చిన్న విషయానికే కోపం రావడం, విసుక్కోవడం, ఇతరులను తిట్టడం
  • మూడ్ స్వింగ్స్ అధికంగా ఉండటం
  • ఇతరుల పట్ల గౌరవం, ఆసక్తి చూపించకపోవడం

 ఏం చేయాలి?

పిల్లలకు ప్లేష్టేషన్లు, వీడియో గేమ్స్ కొనివ్వకండి.. వారు హింసాత్మక గేమ్స్ ఆడితే మొదట్లోనే అడ్డుకోండి.. పిల్లలకు ప్రత్యేకంగా గది ఇచ్చినట్లయితే అందులో బెడ్, పుస్తకాలు తప్ప మరే ఇతర సౌకర్యాలు కల్పించకండి.. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించండి. అతడు ఎలాంటి గేమ్స్ ఆడతాడో వివరించండి. వైద్యులు మీ పిల్లవాడికి చికిత్స అందిస్తారు. 

Leave a Comment