ఈరోజుల్లో అధిక బరువుతో ఎంతో మంది సతమతమవుతున్నారు. ఒకప్పుడు ఇది పెద్ద సమస్యగా అనిపించేది కాదు. కానీ ప్రస్తుతం అధిక బరువు అనేది అనేక సమస్యలతో కూడుకుంది. అందుకే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నగా ఫిట్ గా ఉండేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. ఫిట్ గా ఉండాలంటే జిమ్, వ్యాయామాలు, యోగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజీ జీవితంలో అనేక మందికి ఇవన్నీ పాటించే తీరిక లేదు. దీంతో శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే బరువు త్వరగా ఎలా తగ్గే మార్గాలను అన్వేషిస్తున్నారు..
అలాంటి వారికి ఇది మంచి వార్తే అనాలి.. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచేందుకు ఎల్ఈడీ స్లిమ్మింగ్ డివైజ్(హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అల్ట్రాషేప్ బాడీ స్లిమ్మింగ్ మెషిన్) వచ్చింది. ఈ డివైజ్ మూడు టెంపరేచర్ మోడ్స్, ఐదు ఎనర్జీ లెవల్స్ ని కలిగి ఉంటుంది. తీరిక ఉన్నప్పుడు ఈ డివైజ్ తో మసాజ్ చేసుకోవచ్చు. తీరకలేనప్పుడు బెల్ట్ పెట్టుకోవచ్చు. శరీరంలో ఏ భాగానికి కావాలో ఆ భాగానికి పెట్టుకోవచ్చు.
డివైజ్ లో భాగాలు..
ఈ ఎల్ఈడీ స్లిమ్మింగ్ మెషిన్ అడుగు భాగంలో నాలుగు వైపులా నాలుగు మిడ్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. మధ్యలో ఒక సెన్సర్ పాయింట్, దాని చుట్టు 18 ఎల్ఈడీ లైట్స్, వాటి చుట్టూ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి.
ఎలా ఉపయోగించాలి?
ఈ డివైజ్ సహాయంతో చేతులు, తొడలు, నడుము, పొట్ట వద్ద కొవ్వును తగ్గించుకోవచ్చు. దీనిని ఉపయోగించడం కూడా చాలా సింపుల్.. కేవలం ఈ డివైజ్ ని ఆన్ చేసి చార్మానికి ఆనించాలి. అంతే ట్రీట్మెంట్ అనేది అందుతుంది. దీని ద్వారా బాడీ స్లిమ్మింగ్, స్కిన్ టైటెనింగ్, బాడీ షేపింగ్ వస్తాయి. దీంతో పాటు జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ డివైజ్ ధర విషయానికి వస్తే తక్కువే అని చెప్పాలి.