పక్షులకేమోగానీ, మనుషులకు గుండెపోటు రావడం ఖాయం..వీడియో వైరల్..!

సాధారణంగా పొలంలో పశువులు, పక్షల నుంచి పంటను కాపాడుకునేందుకు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షలు, పశువులు తినకుండా, దిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. అలా ఓ రైతు చేసిన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాకులు, ఇతర పక్షుల బెడద నుంచి తన పొలాన్ని రక్షించుకునేందుకు ఓ రైతు వినూత్న ఐడియా చేశాడు. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment