వీడియో వైరల్ : 11 ఏళ్ల పాటు సేవలందించిన జగిలానికి ఘన వీడ్కోలు..!

పోలీస్ శాఖలో 11 ఏళ్ల పాటు విశేష సేవలందించిన స్నిఫర్ డాగ్ కు నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. స్నిఫర్ స్పైక్ సేవలను ప్రశంసిస్తూ గులాబీలు, బెలూన్స్ తో అలంకరించిన పోలీస్ వాహనంపై దాన్ని ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ స్నిపర్ డాక్ గత 11 ఏళ్లుగా విధి నిర్వహణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది.ఈ స్నిఫర్ జాతికి చెందిన కుక్కలను చిన్న వయస్సు నుంచే శిక్షణ ఇస్తారు. తుపాకీలు, మాదక ద్రవ్యాలు, బాంబులు వంటి వాటిని గుర్తించడానికి వాడతారు. 

ఇక ఈ స్పిపర్ డాక్ వీడ్కోలు సందర్భంగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం దాని సేవలను కొనియాడారు. స్నిఫర్ జాగిలం మాత్రమే కాదని, పోలీస్ కుటుంబంలో తను కూడా భాగమయ్యాడని పేర్కొన్నారు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.  

 

Leave a Comment