రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్..

19
Ram Charan Fans

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు యువతలో భారీ క్రేజ్. సోషల్ మీడియాలోనూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా చరణ్ అభిమానులు తమ అభిమాన నటుడిని చేసేందుకు చేసిన పని చర్చనీయాంశంగా మరాంది. 

సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే యువకులు రామ్ చరణ్ కు పెద్ద ఫ్యాన్స్. వీరు ముగ్గురు రామ్ చరణ్ ను కలిసేందుకు జోగులాంబ గద్వా్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 231 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నాలుగు రోజులు కష్టపడి తమ అభిమాన హీరోను కలుసుకున్నారు. 

ఈ విషయం తెలుసుకుని వారి అభిమానానికి రామ్ చరణ్ ఫిదా అయ్యారు. తన కోసం ఇంతలా కష్టపడి వచ్చిన అభిమానులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు.   

  

Previous articleటీమిండియాకు ‘చోకర్స్’ ముద్ర..!
Next articleఖాళీ సిరంజితోనే టీకా వేసిన నర్సు.. వీడియో వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here