సింగర్ ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం.. వైరల్ వీడియో..!

‘క్వీన్ ఆఫ్ గుజరాతీ ఫోక్’ ఊర్వశి రాడాడియాపై నోట్ల వర్షం కురిసింది. ఓ సంప్రదాయ వేడుకలో పాల్గొన్న ఆమెపై అభిమానులు కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నవంబర్ 15న అహ్మదాబాద్ లో జరిగిన ‘తులసీ కల్యాణం’ వేడుకలో ఊర్వశి రాడాడియా తన బృందంతో సంగీత కచేరి చేశారు. ఆమె హార్మోనియం వాయిస్తూ పాట పాడుతుండగా ఆ వేడుకకు హాజరైన వారు బాక్సుల్లో కరెన్సీ నోట్లు తీసుకొచ్చి ఊర్వశిపై జల్లారు. ఆమెపై డబ్బుల వర్షం కురిసిన ఈ వీడియోను ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. నోట్ల వర్షం కురవడానికి మీ వాయిస్ లో ఉన్న మ్యాజిక్ కారణమంటూ కొందరు కామెంట్లు చేశారు..

 

Leave a Comment