ఇంట్లో పెద్ద దిక్కు చనిపోతే.. ఏడవకుండా నవ్వుతూ ఫొటోలు దిగారు..!

ఇంట్లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యుల రోదనలు ఎలా ఉంటాయో తెలిసిందే.. ఇక బంధువులు, సన్నిహితులు వచ్చి వారిని ఓదారుస్తుంటారు.. కానీ, కేరళలో ఓ కుటుంబం దానికి భిన్నంగా వ్యవహరించింది. పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలో 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ కుటుంబ సభ్యులంతా నవ్వుతూ ఫొటో దిగారు. 

మరియమ్మ అనే 95 ఏళ్ల బామ్మ ఆగస్టు 17న చనిపోయారు. ఆమెకు 9 మంది సంతానం ఉండగా.. వారికి 19 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. అనారోగ్యం కారణంగా మరియమ్మ మరణించారు. దీంతో కుటుంబ సభ్యులందరూ స్వగ్రామానికి వచ్చారు. ఆమె గుర్తుగా అందరూ నవ్వుతూ ఫొటో దిగారు.. ఈ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు వారిని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం వారికి సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment