ఎంత చెప్పినా మార్పు రాదు..!

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంత చెప్పినా వైద్యశాఖలో మార్పు రావడం లేదు. నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పత్రిలో కరోనా రోగులను పట్టించుకోవడం లేదు. పీపీఈ కిట్లు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులకు వారి సహాయకులే సేవలు చేస్తున్నారు. వారికి  అవగాహన లేకపోవడంతో మాస్కులు లేకుండానే రోగులకు దగ్గరగా ఉంటూ సేవలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇదే ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో యాదయ్య అనే రోగి మరణించిన సంగతి తెలిసిందే. 

Leave a Comment