ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం..!

ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశించారు. 

ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలన్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని తగ్గించినందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా ఖాతాల్లోకి, తర్వాత ఆస్పత్రికి చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరైనా లంచం అడిగినా.. లేదా అదనపు ఫీజు వసూలు చేసినా.. ధ్రువీకరణ పత్రంలో ఫిర్యాదుల కోసం ఏసీబీకి కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంచాలని ఆదేశించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబందిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై విచారణ చేయాలన్నారు.  

 

 

Leave a Comment