రెమిడెసివిర్ ఇప్పించాలని సీఎంఓ కాళ్లపై పడ్డ మహిళలు.. వీడియో వైరల్..!

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలో ఇచ్చే రెమిడెసివిర్ ఇంజెక్షన్ కు కొరత ఏర్పడింది. కరోనా సోకి ఆపదలో ఉన్న వారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఇప్పించాలని బాధితుల కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకుంటున్నారు. 

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ వారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఇప్పించాలని ఓ కుటుంబం చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) దీపక్ ఓహ్రీ కాళ్లపై పడి వేడుకుంది. తమ వాళ్లను బతికించాలని కోరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. 

తాము రెమిడెసివిర్ ఇంజెక్షన్ కోసం ఇక్కడకు వచ్చామని, కానీ అధికారులు మాత్రం అందుబాటులో ఉన్నప్పుడు ఇస్తామని తెలిపారని ఓ మహిళ చెప్పింది. ఈ సారి వస్తే జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారని పేర్కొంది. 

Leave a Comment