నకిలీ విజయ దేవరకొండ అరెస్టు..!

హీరో విజయ్ దేవరకోండ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలను మోసం చేస్తున్న..నకిలీ విజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకున్న ఫాలోయింగ్ ని గ్రహించిన ఓ కేటుగాడు..హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. విజయ్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి..తనను కలవాలంటే ఫలానా నెంబర్ కి పోన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడు. ఇది నిజమేనని నమ్మిన చాలా మంది అమ్మాయిలు.. ఆ వ్యక్తితో చాటింగ్ చేసి మోసపోతున్నారు. 

అయితే ఇది విజయ్ దృష్టికి చేరడంతో..ఈసారి హీరోనే స్వయంగా రంగంలోకి దిగి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు..ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాటింగ్ చేశారు. అలాగే మెల్లగా అతడిని ట్రాప్ చేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ తో ఫోన్ మాట్లాడించి, హైదరాబాద్ కి రమ్మన్నాడు. ఇదే లక్కీ ఛాన్స్ అనుకున్న కేటుగాడు హైదరాబాద్ వచ్చాడు. వచ్చీరాగానే పోలీసులు అతడ్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

ఆ నకిలీ వ్యక్తిని విచారించగా..అసలు విషయాలు బయటపెట్టాడు. తనది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వాడినని, విజయ్ దేవరకొండ అంటే ..అమ్మాయిలు పడిచచ్చిపోతున్న విషయాన్ని గ్రహించి నకిలీ అకౌంట్ క్రియేట్  చేసినట్టు తెలిపాడు. అలాగే మరో ఇద్దరి హీరోల పేర్లతో కూడా అకౌంట్లు తెరిచినట్లు వివరించాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..నకిలీ అకౌంట్లను నమ్మవద్దని కోరారు. అలాగే హీరో విజయ్ టీం కూడా..విజయ్ కి ఫేస్ బుక్ అకౌంట్ లేదని, నకిలీ ట్రాప్ లో పడొద్దని తెలిపారు. 

Leave a Comment