సోషల్ మీడియాలో  ఫేక్ న్యూస్ వైరల్

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ విన్నా కరోనా వైరస్ మార్మోగుతోంది. ఎందుకంటే ఈ వైరస్ తో ప్రపంద దేశాలు వణికిపోతున్నాయి. దేశంలోనూ రోజురోజుకు దీని ప్రభావం పెరిగిపోతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇప్పుడు వరదలా వచ్చిపడుతోంది. అయితే ఇలాంటి ప్రచారాల నుంచి కాపాడుకునేందుకు సమాచార పరిశుభ్రత పాటించాలని నిపుణులు కోరుతున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం చెలరేగకుండా  మీరు ఏం చేయాలి..ఇప్పుడు తెలుసుకుందాం..

సమచారం పంపే ముందు ఆలోచించండి..

మీకు ఏదైనా సమాచారం వచ్చింది. దానిని మీరు మీ మిత్రులకు, బంధువులకు వెంటనే తెలియజేయాలి అనుకుంటారు. అసలు వచ్చింది సరైన సమాచారమేనా అని ఆలోచించకుండా ఈమెయిల్, వాట్సాప్, ఫేస్ బుక్ లేదా ట్విటర్ ద్వారా వచ్చిన మెసేజ్ ను పార్వార్డ్ చేస్తారు. అయితే ఇలాంటి సమాచారం పంపే ముందు ఒక సారి ఆలోచించండి. వచ్చింది కరెక్ట్ సమాచారమేనా..లేదా ఫేక్ న్యూస్ వచ్చిందా అని సరిచూసుకోండి. అది నిజమైన సమాచారం అయితే ఫార్వార్డ్ చేయండి. 

సమాచారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి..

మీకు ఫేస్ బుక్, వాట్సాప్ లలో కుప్పలు తెప్పలుగా మెసేజ్ లు వస్తుంటాయి. మీరు దాని గురించి ఏమి ఆలోచించకుండా ఇతరులకు ఫార్వార్డ్ చేస్తుంటారు. అయితే మీకు వచ్చిన సమాచారాన్ని ఫార్వార్డ్ చేసేముందు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 

మీకు మెసేజ్ చేసిన వారిని ఆ సమాచారం ఎలా వచ్చిందో అడగండి. ఒక వేళ మీకు వచ్చిన సమాచారానికి సరైన ఆధారాలు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దానిని మీరు ఫార్వార్డ్ చేయకండి. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే పోస్టులు ఎన్ని వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.

కరోనా వైరస్ విషయంలో కూడా ఎన్నో వాస్తవం లేని సమాచారాలు వైరస్ అవుతున్నాయి. దానిని మీర గమనించాలి. అయితే వస్తున్న కొన్ని పోస్టుల్లో వాస్తవాలు ఉండవచ్చు. చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు వంటివి. కాని మిగతా సమాచారం చాలా ప్రమాదరకమైంది. రోగ నిర్ధారణ ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి నిరూపణ కాని విషయాలు వస్తున్నాయి. అటువంటి వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మీకు వచ్చిన సమాచారం సరైందేనా?

ఒక్కో సారి మన కంటికి కనిపించేది కూడా వాస్తవం కాకపోవచ్చు. అలాంటి మనకు తెలియకుండా సోషల్ మీడియాలో పెట్టింది వాస్తవం అని ఎలా నమ్మాలి. 

ఈ మధ్య బాగా ప్రచారంలో ఉన్న సంస్థల, వ్యక్తుల, ప్రభుత్వ అధికారిక ఖాతాలను ఉపయోగించి ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నారు. ఆ సమాచారం ప్రభుత్వ సంస్థల నుంచే వచ్చింది అని అనిపించేలా స్క్రీన్ షాట్లను కూడా మార్చి మెసేజ్ చేస్తున్నారు. 

ఈ మధ్య బాగా ప్రచారం అయిన ఫొటో గురించి ఉదాహరణగా చెబుతున్నాము. ప్రముఖ వ్యాపార వేత్త సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ కరోనా వైరస్ నివారణకు రూ.52వేల కోట్లు విరాళం ఇచ్చినట్లు సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే నిజానికి అజీమ్ ప్రమ్ జీ 2019 లో ఒక చారిటీకి రూ.50వేల కోట్లను విరాళంగా ఇచ్చారు. కాని దానిని కరోనా వైరస్ కోసం ఇచ్చినట్లు సమాచారం వైరల్ అయింది. అది నిజమా కాదా అని నిర్ధారించుకోకుండా చాలా మంది దానిని ఫార్వార్డు చేస్తున్నారు. 

మీరు అలాంటి తప్పుడు సమాచారం వచ్చిన్నప్పుడు దానికి గురించి విచారించండి. తెలిసిన, ధ్రువీకరించిన ఖాతాలు, వెబ్ సైట్లను పరిశీలించండి. అక్కడ మీకు సమాచారం దొరకలేదంటే మీకు వచ్చిన సమాచారం ఫేక్ అని గుర్తించండి. 

ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  కొన్ని తప్పుడు విషయాలు..

1. అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ

2. J D లక్ష్మీనారాయణ గారి వాయిస్

3. ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు

4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి

5. డాక్టర్ దంపతుల మరణం

6. రష్యా 500 సింహాలు రోడ్లపై వదలడం

7. కరోనా వైరస్ కు dr గుప్త మందు

8. రోడ్ల పైన పడి ఉన్న దేహాలు

9. dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన

10. COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు

11.ఆవుకు పుట్టిన మనిషి

12.మోడీ గారి 1000 GB  ఫ్రీ..

13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు…

ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు…. ఇలాంటివి మన ఫోనులో మరెన్నో..

ఇలాంటి తప్పుడు వార్తల మధ్య “వాస్తవాలు” నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం…..

మిత్రులారా మేల్కొనండి.. వదంతులు తప్పుడు సమాచారాలు నమ్మకండి.. ప్రచారం చేయకండి.. వివేకంతో ,బాధ్యతగా మెలుగుదాము..

నిర్ధారణ చేసుకున్నాకే షేర్ చేయండి..

మీకు వచ్చిన సమాచారం నిజమో కాదో తెలియనప్పుడు దానిని ఫార్వార్డ్ చేయకండి. అసలు ఏదైనా పోస్టు, వీడియో, లింక్ అనుమానస్పదంగా అనిపిస్తే..దానిని అనుమానించాల్సిందే. అటువంటి వాటికి పెద్ద పెద్ద అక్షరాలు, అసంబద్ధమైన రాత ఫాంట్ ఉంటే కనుక ఆ సమాచారం తప్పుదొవ పట్టించేది అనటానికి అవే సంకేతాలని నిజనిర్ధారణ చేసే నిపుణులు భావిస్తుంటారు. 

ఒక సందర్భంలో చెప్పిన విషయాలను మరొక సందర్భానికి, సంఘటనలకి ముడిపెట్టి పోస్టులు, మెసేజ్ లు, ఫొటోలు తయారు చేస్తుంటారన్న విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. 

భావోద్వేగ పోస్టులతో జాగ్రత్త..

ప్రస్తుతం చాలా పోస్టులు మనల్ని భావోద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. మనల్ని భయపెట్టే, కోపం తీసుకొచ్చే, ఆందోళనకు గురిచేసే, ఆనందింపజేసే ఈ పోస్టులు బాగా వైరల్ అవుతుంటాయి. తప్పుడు సమాచారాన్ని పెంచిపోషించే వాటిల్లో కీలకమైంది భయం. అటువంటి పోస్టుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. 

 

Leave a Comment