వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే టాలెంట్ తో పాటు అందంగా కూడా ఉండాలి. అందుకే అందంగా కనిపించేందుకు కొంత మంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది నటులు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్నారు. అయితే సర్జరీలు కొన్నిసార్లు వికటిస్తున్నాయి. అలా వికటించి మరీ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు.. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నాయి. 

తాజగా కన్నడ హీరోయిన్ స్వాతి సతీష్  సర్జరీ వికటించింది. ‘ఎఫ్ఐఆర్’, 6 టు 6’ వంటి సినిమాలతో స్వామి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె తన అందాన్ని మెరుగు పర్చుకునేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసై్పత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ వికటించడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారింది. 

నటి స్వాతి ముఖం అంతా వాపు వచ్చింది. ఈ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని వైద్యులు చెప్పినా.. మూడు వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం వాచిపోవడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇంటినుంచి బయటకు కూడా వెళ్లడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చింది. 

కాగా ఆస్పత్రిలో డెంటిస్ట్ తనకు తప్పుడు చికిత్స ఇచ్చినట్లు స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు చెప్పింది. ట్రీట్మెంట్ కోసం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం తెలిసిందని తెలిపింది. ప్రస్తుతం స్వాతి ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

Leave a Comment