ఏపీలో టీచర్లకే కాదు.. ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్..!

పాఠశాలల్లో టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.. అలాగే ఈ వ్యవస్థ కేవలం టీచర్లకు మాత్రమే కాదని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తామని మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు.  ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో దీనిని ప్రవేశపెట్టారు.

ఫేస్ రికగ్నిషన్ యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేంలో చర్చించారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్ కు సంబంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిదని, దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేశాలను నివృతి చేసే విధంగా చర్యలు చేపట్టామని మంత్రి బొత్స అన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 

స్కూల్ కి లేటుగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానమే అన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలు ఏమీ పెట్టలేదన్నారు. అటెండెన్స్ యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బొత్స స్పష్టం చేశారు. 

 

Leave a Comment