లాక్ డౌన్ : ఇంట్లోనే రోగనిరోధక శక్తని పెంచుకునే వ్యాయామాలు

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ సమసయంలో ఇంటి లోపల పరిమితం అవుతున్నాము. పార్కులు, జిమ్ లు కూడా మూతపడ్డాయి. ఆ సమసయంలో మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇందు కోసం మీరు ఇంట్లో ఉండి చేసుకునే వ్యాయామాలు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయమాలు చేయడం ద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ఇంట్లో ఉండటం వల్ల మీ శరీర బరువు, బెల్లి ఫ్యాట్ కూడా పెరిగి ప్రమాదముంది. ఇందు కోసం ప్రతి రోజు 40 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. దీంతో పాటు తగినంత నిద్ర ఉండాలి. వీటిని ప్రతి రోజు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

ఇంట్లోనే చేయాల్సిన వ్యాయామాలు..

బర్పీ :

ఈ వ్యాయామాన్ని చేయడం ద్వారా గుండె సంబంధిత జబ్బులను నివారించవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. ఈ వ్యాయామం శరీరానికి బలాన్ని ఇస్తుంది. అలాగే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

revers lunges

రివర్స్ లంజ్ :

ఈ వ్యాయామం శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఈ వ్యాయామం క్రమం తప్పకుండా 15 నిమిషాల పాటు చేయడం ద్వారా కండరాలు బలంగా మారడంతో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ప్లాంక్స్ :

ఈ వ్యాయామం బెల్లి కొవ్వును కరగిస్తుంది. మరియు లోయర్ బ్యాక్ ను కూడా బలపరుస్తుంది. బ్యాక్ పెయిన్ ను కూడా తగ్గిస్తుంది. దీనికి ఒక రౌండ్ కు 30 సెకన్ల నుంచి ఒక నిమిషం పాటు చేయవచ్చు. ఇలా మూడు రౌండ్లు చేయాలి. 

పుషప్స్ :

ఇది శరీరం పైభాగం వ్యాయామం. ఈ వ్యాయామాన్ని చేయడం వల్ల ఛాతీ, భుజం, వీపు, కండరపుష్టి, ట్రైసెప్స్ మరియు కాలర్ ఎముకకు ప్రయోజనం చేస్తాయి. ఇది శరీరాన్ని బలంగా మార్చడంలో సహాయపడుతుంది. 

Leave a Comment