చిప్స్ ఎక్కువగా తింటే.. సంతాన సమస్యలు..!

ఆలూ చిప్స్.. చూడగానే నోరూరిపోతుంది.. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.. టేస్టీ చిప్స్ అంటే ఇష్టపడని వారుండరు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు.. పిల్లలే కాదు యువత కూడా చిప్స్ ని తెగ తింటున్నారు.. అందకే ప్యాకెట్లకు ప్యాకెట్లు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు. మరి ఇంత రుచిగా ఉండే చిప్స్ ఆరోగ్యానికి మంచివేనా అంటే మరో ఆలోచన లేకుండా మంచివి కాదని అంటున్నారు నిపుణులు.. చిప్స్ రోజూ తినేవారిలో దీర్ఘకాలికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు…

చిప్స్ తో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. 

  • చిప్స్ లో ఉండే కొన్ని రకాల కొవ్వులు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపతాయి. దీని వల్ల తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భం దాల్చడం కష్టమైపోతుంది. చిప్స్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మహిళల్లో సంతాన లేమి సమస్య రావచ్చు. కాబట్టి చిప్స్ ని పూర్తిగా మానేయడం మంచిది. 
  • చిప్స్ ను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
  • చిప్స్ అధికంగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. చిప్స్ వంటి అతిగా శుద్ధి చేసిన ఆహారంలో అక్రిలమైడ్ అనే కార్సినెెజెనిక్ లక్షణాలు ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ వెల్లడించింది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. 
  • చిప్స్ ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉండేందుకు సాల్ట్ ని అధికంగా కలుపుతారు. ఇలాంటి చిప్స్ రోజూ తినేవారిలో బీపీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులను, స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని రెట్టింపు చేస్తాయి.
  • చిప్స్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. వాటి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కోపం త్వరగా రావడం, యాంగ్జయిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చిప్స్ కి దూరంగా ఉండటమే మేలు..   

Leave a Comment